శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాకినాడను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతా: ప్రెసింగి లక్ష్మి

15 నవంబర్, 2026

కాకినాడను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతా: ప్రెసింగి లక్ష్మి
మేయర్ స్థానానికి నామినేషన్ దాఖలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 05:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మేయర్ స్థానానికి నామినేషన్ దాఖలు

ప్రజాశక్తి-కాకినాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పాటు నగరంలోని మేధావులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కాకినాడను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని కూటమి మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ప్రెసింగి లక్ష్మి తెలిపారు. ఆదివారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ స్థానానికి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన భర్త ఆదినారాయణతో కలిసి ఆమె మాట్లాడారు. నగరంలో పారిశుధ్య సమస్యలు, దోమల బెడద తీవ్రంగా ఉన్నాయని, కొద్దిపాటి వర్షానికే ఇళ్ల ముందు నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారంతో పాటు నగరానికి మెరుగైన పాలన అందించేందుకు తన వద్ద సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ఉందని, అవకాశం కల్పిస్తే దానిని అమలు చేసి కాకినాడను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని లక్ష్మి, ఆదినారాయణ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్