మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గట్కా క్రీడా పోటీలకు విద్యార్థులు ఎంపిక

11 గంటల క్రితం

గట్కా క్రీడా పోటీలకు విద్యార్థులు ఎంపిక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 05:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - బిక్కవోలు

పందలపాక పీఎంశ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు అండర్-17, 19 గట్కా క్రీడాపోటీలకు ఎంపికయ్యారని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ద్వారంపూడి యువరాజారెడ్డి తెలిపారు. అండర్-17 విభాగంలో బి.చాందినిప్రియ, జి.తేజసాయిశ్రీ, బి.హేమసాయిశ్రీ, అండర్-19కి పి.సత్యహరిణి, పి.లక్ష్మీసాయిదుర్గ, ఎల్.లక్ష్మీదేవి బాలుర విభాగంలో అండర్-19 సింగం పునీత్, జక్కా కృష్ణతేజ ఎంపికయ్యారు. సోమవారం కాకినాడలో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడా ఎంపికల్లో వారు పాల్గొని ప్రతిభ కనబర్చడంతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. త్వరలో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను, తర్ఫీదునిచ్చిన యువరాజారెడ్డిని భీమేశ్వర్రెడ్డిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చర్ల శ్రీనివాసరెడ్డి, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోణాల సత్తిరాజు, పిఎంసి చైర్మన్ పంపన వీర సత్యనారాయణ తదితరులు అభినందించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్