ప్రజాశక్తి-గండేపల్లి
స్థానిక ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో తృతీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ‘డిజిటల్ డిజైన్ యూజింగ్ వెరిలాగ్ ఇన్ వీఎల్ఎస్ఐ’ మూడు రోజుల వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్‌కు చెందిన ‘ఆర్ టెక్నో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సౌజన్యంతో అక్టోబర్ 8 నుంచి 10వ తేదీ వరకు ఈ శిక్షణా కార్యక్రమం జరిగింది. వర్క్‌షాప్‌లో భాగంగా వీఎల్ఎస్ఐ అప్లికేషన్లు, డిజైన్ మోడల్స్‌పై నిపుణులు ప్రాయోగిక శిక్షణ అందించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ ... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నైపుణ్యవంతులైన ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. వీఎల్ఎస్ఐ రంగంలో భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇటువంటి వర్క్‌షాప్‌లు ఎంతగానో దోహదపడతాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి. నరేష్, విభాగాధిపతి కె.వి. దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.
కార్యక్రమానికి ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్‌గా పి.పుష్పలత వ్యవహరించగా, కళాశాల డైరెక్టర్ మేనేజ్మెంట్ ఎం.వి. హరనాధబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, డైరెక్టర్ అకడమిక్స్ డాక్టర్ కె.సత్యనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)