శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అడోబ్ హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలేకు ఆదిత్య విద్యార్థులు

6 రోజుల క్రితం

అడోబ్ హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలేకు ఆదిత్య విద్యార్థులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 07:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -గండేపల్లి

అడోబ్ యూనివర్సిటీ హ్యాకథాన్–2026లో ఆదిత్య విశ్వవిద్యాలయం విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి గ్రాండ్ ఫినాలేకు ఎంపికైనట్లు ప్రో ఛాన్సలర్ డాక్టర్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. మూడు లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు  నమోదైన ఈ పోటీలో విశ్వవిద్యాలయానికి చెందిన ‘టీమ్  నెక్సోరా’ గ్రాండ్ ఫినాలేకు ఎంపికైన ఎనిమిది జట్లలో స్థానం సాధించిందని తెలుగు రాష్ట్రాల నుంచి ఈ తుది పోటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక విద్యాసంస్థగా ఆదిత్య విశ్వవిద్యాలయం నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. గ్రాండ్ ఫినాలేలో పాల్గొనేందుకు విద్యార్థుల బృందం అక్టోబర్ 15న నోయిడాకు పయనం కానుంది అని చెప్పారు. ఐఐటి పట్నా, ఐఐటి గువాహటి, ఐఐఐటి అలహాబాద్, అమృత విశ్వవిద్యాపీఠం–కోయంబత్తూరు, శివనాడార్  విశ్వవిద్యాలయం– గ్రేటర్నోయిడా, అటల్ బిహారీ వాజ్‌పేయి– ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, ఇంద్ర ప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–ఢిల్లీతోపాటు ఆదిత్య విశ్వవిద్యాలయం గ్రాండ్ ఫినాలేలో పాల్గొననుంది. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల సరసన స్థానం సాధించడం ఆదిత్య విద్యార్థులు సాంకేతిక ప్రతిభకు, నిరంతర కృషి, పట్టుదలకు నిదర్శనం అన్నారు. ‘టీమ్నెక్సోరా’లో ధనుష్ కొనకొండ్ల, అజర్యపాల్ అంతపర్తి, శ్రీరాజ్ గంగిశెట్టి సభ్యులుగా ఉన్నారు. వీరికి కంప్యూటర్  సైన్స్ అండ్ ఇంజనీరింగ్  విభాగం హ్యాకథాన్ కో ఆర్డినేటర్. ఎం.అశోక్ తేజ మెంటర్‌గా మార్గదర్శకత్వం వహిస్తున్నారు. జాతీయ స్థాయి వేదిక పై ఆదిత్య విశ్వవిద్యాలయానికి గుర్తింపు తీసుకొచ్చిన ఈ బృందం సాధన తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. విద్యార్థుల సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మక ఆలోచనలు, సమష్టి కృషికి ఈ విజయం అద్దం పడుతోంది. గ్రాండ్ ఫినాలేలో నెక్సోరా టీమ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని డిప్యూటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ ఎం.శ్రీనివాస రెడ్డి, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎంబి.శ్రీనివాస్, రిజిస్ట్రార్ డాక్టర్ జి.సురేష్, ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఎస్.రమాశ్రీ, డాక్టర్ ఎ.రమేష్, డాక్టర్ రవితంగజం, డీన్ టెక్నికల్ ట్రైనింగ్ జి.రాము ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్