శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాకినాడలో కొవ్వొత్తులతో సిపిఎం నిరసన

5 రోజుల క్రితం

కాకినాడలో కొవ్వొత్తులతో సిపిఎం నిరసన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కాకినాడ :

​దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని తొలగించాలని కోరుతూ కాకినాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం నాయకులు శనివారం కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషబాబ్జి, చెక్కల రాజ్‌కుమార్‌, నగర కమిటీ సభ్యుడు కె.సత్తిరాజు మాట్లాడుతూ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే ఓటు హక్కు కల్పించాలని, భారత ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను కాపాడాలని డిమాండ్‌ చేశారు. జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పాలకులు విఫలమైనప్పుడు ప్రజలు ముందుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న చరిత్ర భారతదేశానికి ఉందని, మరోసారి అదే చరిత్ర పునరావృతమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కె.ఎస్‌ శ్రీనివాస్‌, నగర కన్వీనర్‌ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మలక వెంకటరమణ, నాగాబత్తుల సూర్యనారాయణ, కె. నాగజ్యోతి, సీహెచ్‌. వేణి, మేడిశెట్టి వెంకటరమణ, చంద్ర, నాగలక్ష్మి, రాణి, బాలం సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్