శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రభుత్వ ప్రోత్సాహకాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలి

14 నవంబర్, 2026

ప్రభుత్వ ప్రోత్సాహకాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలి
ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, బొటిక్ డిజైనర్ వాసంతి పిలుపు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 07:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, బొటిక్ డిజైనర్ వాసంతి పిలుపు

ప్రజాశక్తి-కాకినాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు అనేక సంక్షేమ, ప్రోత్సాహక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగించుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ప్రముఖ బొటిక్ డిజైనర్ వాసంతి పిలుపునిచ్చారు. కాకినాడ మెయిన్ రోడ్డులోని ఎస్‌ఆర్‌ఎంటీ ఫంక్షన్ హాలులో రెండు రోజులపాటు నిర్వహించనున్న 'వాసంతి ఎక్స్‌పో'ను శనివారం ఘనంగా ప్రారంభించారు. అనంతరం వివిధ స్టాళ్లను సందర్శించారు. పద్మశ్రీ మాట్లాడుతూ మహిళలు ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని స్వయం ఉపాధి రంగంలో రాణించడంతో పాటు ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. వాసంతి మాట్లాడుతూ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్స్‌పోలు నిర్వహించామని, తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ వేదికగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో 100 మందికి పైగా మహిళా వ్యాపారవేత్తలు పాల్గొని వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన ఉత్పత్తులతో పాటు లేటెస్ట్ ఫ్యాషన్, సంప్రదాయ చీరలు, ఇమిటేషన్ నగలు, బ్యూటీ ఉత్పత్తులు, గృహోపకరణాలు, ఆరోగ్య ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు వివరించారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఎక్స్‌పోను మహిళలంతా సందర్శించి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో సామాజికవేత్త, లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ కొడాలి ఉమాదేవితో పాటు పలువురు మహిళలు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్