ప్రజాశక్తి-రామచంద్రపురం(కోనసీమ) : త్వరలో జరగనున్న మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ ఆదేశాల మేరకు కే. గంగవరం మండలంలో పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో, ఉప ఎన్నికల అధికారి ఎన్. శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. కే. గంగవరం మండలంలో మొత్తం 58 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పోలింగ్ స్టేషన్ల వివరాలను మండల పరిషత్ కార్యాలయం వద్ద నోటీసు బోర్డులో ప్రచురించినట్లు పేర్కొన్నారు. ఆయా గ్రామపంచాయతీల పరిధిలోని ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వివరాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు పూర్తవడంతో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
కే.గంగవరంలో 58 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 12:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)