గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చింతలూరు ఆలయాలకు చెందిన ఆభరణాల తనిఖీ

1 గంట క్రితం

aalamuru-2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 04:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : మండలంలోని చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలోను, శ్రీ పృథ్వీశ్వర స్వామివారి ఆలయంలోను ఆభరణాల తనిఖీలు జరిగాయి. దీనిపై గురువారం ఆయా దేవస్థానాలకు చెందిన ఆలయాల కార్యనిర్వహణాధికారి వుండవల్లి వీర్రాజుచౌదరి మాట్లాడుతూ.. దేవాదాయ ధర్మాదాయ శాఖ నగల తనిఖీ ప్రత్యేకాధికారి వి.పళ్లంరాజు అధ్వర్యంలో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారి బంగారం, వెండి ఆభరణాలను రికార్డులను తనిఖీ చేస్తూ తూకం వేశారన్నారు. అలాగే ఇటీవల కాలంలో నూకాంబిక అమ్మవారికి అలంకరనణార్థం దాతలు బహూకరించిన వెండి, బంగారు ఆభరణాలను కూడా తూకం వేసి, రికార్థులలో నమోదు చేశారన్నారు. అలాగే గ్రామంలోని శ్రీ పృధ్వీశ్వరస్వామి ఆలయానికి చెందిన బంగారు, వెండి ఆభరణాలను తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామ పెద్దలు, ఇతర దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో జరిగిన ఈ తనిఖీలలో రికార్డుల ప్రకారం ఉన్నట్లు గుర్తించారని ఈవో వీర్రాజు చౌదరి తెలిపారు. తనిఖీల అనంతరం ఆభరణాలకు ఇన్సూరెన్స్ పూర్తి చేసి, బ్యాంక్ లాకర్లో భద్రపరిచామన్నారు. ఈ కార్యక్రమంలో మండల దేవాదాయ శాఖ అధికారి ఎమ్మెస్సార్ కృష్ణ, ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ వీరి అప్పారావు, జూనియర్ అసిస్టెంట్ పవన్కుమార్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్