సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నదీజలాలతో నూకాంబిక అమ్మవారికి అభిషేకం

17 గంటల క్రితం

Abhishekam performed for Goddess Nookambika with river water.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 05:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండలంలోని చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయంలో పౌర్ణమి వేడుకలలో భాగంగా కృష్ణానది జలాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు ప్రతి పౌర్ణమికి నదీ జలాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించాలని నిర్ణయంలో భాగంగా కృష్ణానది జలాలతో అభిషేకం చేసి అనంతరం అమ్మవారికి పౌర్ణమి పూజలను పెద్దింటి మణికంఠ శర్మ అధ్వర్యంలో పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వుండవల్లి వీర్రాజుచౌదరి, ట్రస్టుబోర్డు చైర్మన్ వీరి అప్పారావుల అధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అధిక సంఖ్యలో స్థానికులు, యాత్రికులు కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్