ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : పారసంస్థ సిబిఆర్ కోఆర్డినేటర్ బడుగు మహిమారావు ఆధ్వర్యంలో ఆలమూరు పంచాయతీ కార్యాలయం నందు దివ్యాంగుల చట్టం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. దీనిలో భాగంగా రిసోర్స్ పర్సన్ గా హాజరైన ల్యాంప్ సంస్థ అడ్వకేసి కోఆర్డినేటర్ బడుగు సుబ్బాయమ్మ దివ్యాంగులకు చట్టం, ప్రభుత్వ పథకాల , 2016 చట్టం ప్రకారం 21 యొక్క రకాల దివ్యాంగులకు ట్రైన్, బస్సు పాసులు, ఏ కేటగిరి దివ్యాంగుల పరిధిలోకి వస్తారనేది, రూ .15, 000 పింఛన్ ఎవరు అర్హులు స్కూటీలు ఎవరికి ఇస్తారు దాని యొక్క అర్హతలు, ఎవరూ ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా మీ హక్కులని మీరు కాపాడుకోవాలని ఆమె తెలిపారు. సదరం స్లాట్ బుకింగ్ ముందు ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలని, సదరం రీ అసెస్మెంట్ కి వెళ్లిన అమలాపురం వెళ్లిన ఇంతవరకు సర్టిఫికెట్స్ రాలేదని ఆ విషయాన్ని మేము కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళామన్నారు. చట్ట ప్రకారం 40 శాతం అంగవైకల్యం ఉంటే అర్హులని, ఎవరికైనా ఉపకార పరికరాలు అవసరమైతే ఆన్లైన్లో పెట్టుకుంటే ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని అనే విషయాలు పై అవగాహన కల్పించారు. ఇంకా వికలాంగ పింఛనుకు అర్హులైన చాలామంది ఉన్నారని, మంచానికి పరిమితమైన, దివ్యాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి , శ్రీ అసెస్మెంట్ అని పెట్టి అంగవైకల్య శాతాన్ని తగ్గించటం, బహుళ వికలాంగత్వం, సదరం సర్టిఫికెట్స్ లో పేర్లు తప్పులు, పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. అనంతరం దివ్యాంగులతో గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 58 మంది దివ్యాంగులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
దివ్యాంగులకు సంక్షేమ పథకాలపై అవగాహన
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 05:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)