సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విపిఆర్పి పై అవగాహన సదస్సు

59 నిమిషాల క్రితం

Awareness Seminar on VPRP
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 05:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండల కేంద్రంలోని స్త్రీ శక్తి(మండల మహిళా సమాఖ్య) భవనంలో గ్రామ సమృద్ధి స్థితిస్థాపక ప్రణాళిక(విపిఆర్పి)పై వివోఏ లకు, వివోబిలకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎంపీడీవో ఏ.రాజు మాట్లాడుతూ 2026-27 స్వయం సహాయక సంఘాల, గ్రామ సంఘాల ప్రణాళికలలో గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను చేర్చుటకు మార్గదర్శకాలపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ శిక్షణ ద్వారా అక్టోబర్ 2న జరిగే జిపిడిపి ప్రణాళికలోకి చేర్చేందుకు వివోఏలు, వివోబిలు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఇందులో గ్రామ సంఘాలకు, సంఘ సభ్యులకు వ్యక్తిగతంగా కావలసిన అవసరాలను విపిఆర్పి ద్వారా నమోదు చేసి చేర్చవలసి ఉంటుందన్నారు. ఇందులో వయోజన విద్య, ఉపాధి, పింఛన్లు, రోడ్లు, డ్రైన్లు, తదితర అంశాలపై కులంకషంగా వివరాలు సేకరించి అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో అరుణకుమారి, ఏపిఎం ఎస్.సీతారామమ్మ, సిసిలు వి.ఎన్.సత్తిబాబు, కె.ఎల్.వి.ప్రసాద్, అకౌంటెంట్ కుమార్, ఎఫ్ పి అకౌంటెంట్ మల్లీశ్వరి, వివోఏలు వివోబీ లు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్