శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మత్తుకు దూరం...ప్రగతికి మార్గం..

03 ఆగస్టు, 2026

Away from intoxication... a path to progress.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 04:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మామిడికుదురు (కోనసీమ) : యువతను పాడు చేస్తున్న మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరముగా ఉండాలని, అలవాట్లతోపాటు జీవితాలను చీకట్లోకి నెట్టేస్తాయని నగరం ఎస్సై ఎ.పద్మారావు విద్యార్థినుల ను హెచ్చరించారు. మగటపల్లి హైస్కూల్లోహెస్ ఎమ్ కె రామ లక్ష్మీ అధ్యక్షతన సోమవారం విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు విద్యార్థుల రక్షణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్ ప్రతి ఒక్కరి మొబైల్ లో ఉండాలని దానివల్ల ఆపద సమయములో పోలీసుల సహాయం సనాలలో అందుతుందని ఎస్ ఐ సూచించారు. ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియాలో పరిచయము లేని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు, పంచుకోవద్దన్నారు. దేశం లో అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎలాంటి వేధింపులు ఎదురైన భయపడకుండా ఫిర్యాదు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మైనర్ డ్రైవింగ్ చట్ట రీత్యా నేరమని, బైక్ నడిపేటప్పుడు హెల్మట్ తప్పనిసరని స్పష్టం చేశారు.కె రామ లక్ష్మీ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండటం వలన బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారని ఇలాంటి కార్యక్రమం తమ పాఠశాలలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్