శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాడి రైతులు సబ్సిడీ పశు దాణాను వినియోగించుకోవాలి

2 గంటల క్రితం

aalamuru-3
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 05:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమలాపురం పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డా.ఎల్.అనిత, ఆలమూరు పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డా.బి.వి.వి సత్యనారాయణరావు.

ప్రజాశక్తి - ఆలమూరు : పాడి రైతులు సబ్సిడీ పశువుల దాణాను సద్వినియోగం చేసుకోవాలని అమలాపురం పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు డా.ఎల్.అనిత, ఆలమూరు పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డా.బి.వి.వి సత్యనారాయణరావు అన్నారు. మండల కేంద్రంలోని ఆలమూరు పశు సంవర్ధక కార్యాలయం వద్ద శనివారం 20 శాతం ప్రోటీన్లు కలిగిన పశువుల దాణాను (పెల్లెట్స్ దాణా) రైతులకు 50 శాతం సబ్సిడీతో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 50 కేజీల పశువుల దాణా బస్తా ఖరీదు బహిరంగ మార్కెట్లో రూ.1,110లు ఉంటే రైతులకు రూ. 550లకే ప్రభుత్వ సబ్సిడీతో అందించినట్లు తెలిపారు. అలాగే రైతులు తమ పశువుల పట్ల శ్రద్ధ వహించాలని, అనుకోకుండా ఏమైనా వ్యాధులు సోకిన వెంటనే స్థానిక పశు వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రామానుజుల శేషగిరిరావు, ఈదల నల్లబాబు, ఈదల రాంబాబు, రైతులు, అధికారులు, పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్