ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వికలాంగుడికి ఉచిత త్రీ వీలర్ బైక్

1 గంట క్రితం

Free three-wheeler bike for a person with a disability.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 03:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : కూటమి ప్రభుత్వానికి ఓ వికలాంగుడు ఆదివారం కృతజ్ఞత తెలిపిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే కట్టమూరి రమేష్ మండలంలోని గుమ్మిలేరు గ్రామస్తుడు. ఇతను పుట్టుకతోటే వికలాంగుడు. దీంతో ప్రభుత్వ సహాయం అందించాలని అర్జీ పెట్టుకున్నాడు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ భవనం నందు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ప్రభుత్వం వారిచే విభిన్న ప్రతిభావంతుల కోటాలో ఉచితంగా త్రీ వీలర్ బైక్ ను సాయంగా అందించారు. దీనిపై రమేష్ విలేకరులతో మాట్లాడుతూ .... వృత్తిరీత్యా ఒక ప్రైవేటు చిరుద్యోగం చేసుకునే దివ్యాంగుడను అన్నారు. నాకు ఈ బైకు ఎంతగానో ఉపయోగపడుతుందని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నా వ్యక్తిగత అవసరాన్ని గుర్తించి ఉచితంగా ఈ బండిని అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కి, విభిన్న ప్రతిభావంతుల శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామికి, ఎమ్మెల్యే బండారు సత్యానంద రావుకి, ఎంపీ గంటి హరీష్ మాధ్యూర్ కి, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కి, ఇతర అధికారులకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నట్లు రమేష్ తెలిపారు. ఇటువంటి సాయం భవిష్యత్తులో తనలాంటి వికలాంగులకు చేదోడు వాదోడుగా ఉంటుందన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్