-పూర్తిగా పాడైన కొబ్బరిచెట్టుకు 20వేలు
-పాక్షికంగా దెబ్బతిన్న కొబ్బరి చెట్టుకు 15 వేలు
-ఆహర పంటలకు ఎకరాకు 25 వేలు ఇవ్వాలి
-సిపిఎ కేంద్ర బృందం పర్యటనలో నాయుకుల డిమాండ్
ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : ప్రభుత్వాలు అర్నబ్ తుపాను బాధితులను ఆదుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం తన పలుకుబడిని ఉపయోగించి కేంద్రం నుండి సహయం కోరాలని, తుఫాన్ కు అతలాకుతలమైన ప్రజలు, రైతాంగానికి ముఖ్యమంత్రి ప్రకటించిన సహాయం సంతృప్తికరంగా లేదని సిపిఎం కేంద్ర కమిటి సభ్యులు డి.రామదేవి అన్నారు. శుక్రవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు లో సిఎపిఎం కేంద్ర బృందం పర్యటించింది. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ... ఇది సాధారణ తుపాను కాదని, పైగా ఎల్నినో ప్రభావంతో పంటలు వేయక లేదా ఎండిపోయి దిగుబడి తగ్గిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కూలీలకు పనిలేదని, కౌలురైతులు పెట్టుబడి పెట్టి, ముందస్తు కౌలు కట్టి దారుణంగా నష్టపోయారని వివరించారు. తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యంతోపాటు ఒక నెలరోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. మరణించిన వారికి రూ.25 లక్షలు, మునిగిపోయిన ఇళ్లకు రూ..25 వేలు, చేనేత, మత్స్యకార్మికులు, చిన్న దుకాణదారులకు రూ.50 వేలు చొప్పున, ఆటో కార్మికులు, తోపుడు బండ్లకు రూ.25 వేలు చొప్పున ఇవ్వాలని కోరారు. పంటలకిచ్చే సహాయాన్ని ఆహార పంటలకు కనీసం ఎకరాకు రూ.25 వేలకు తగ్గకుండా పెంచాలని, నాలుగు సంవత్సరాల క్రితం నిర్ణయించిన పరిహారాన్నే ఇప్పటికీ కొనసాగించడం సమ్మతం కాదని అన్నారు. ఉద్యానవన పంటలకు, కూరగాయల పంటలకు రూ.25 వేల నుండి రూ.50 వేల వరకు ఇవ్వాలని కోరారు. పడిపోయిన కొబ్బరి చెట్టుకు రూ.20 వేలు, పాక్షికంగా దెబ్బతింటే రూ.15 వేలు ఇవ్వాలని, కౌలు రైతులను గుర్తించి సహాయం వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు పనిలేనందున ప్రతి కుటుంబానికి రూ.10 వేలు చొప్పున అదనపు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా భరించాలని, కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వానికున్న పలుకుబడిని ఉపయోగించి తుపాను, కరువు సహాయార్థం వెంటనే సాధించేలా చూడాలని కోరారు. ఈ పర్యటనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.బలరాం, రాష్ట్ర కమిటి సభ్యులు దడాల సుబ్బారావు, జిల్లా కన్వినర్ కారెం వెంకటేశ్వరరావు, బుంగ సత్యనారాయణ, యార్లగడ్డ శ్రీరాములు పలువురు పాల్గొన్నారు.









కామెంట్లు (0)