ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గ్రామ పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్ధం ....

17 గంటల క్రితం

Everything is set for the Gram Panchayat elections
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 05:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఏఆర్ఓలు, ఎంపీడీవో రాజు, తహసీల్దార్ కుశరాజు


​ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండలంలో ఆదివారం (నవంబర్ 29, 2026) జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎంపీడీవో ఏ.రాజు, తహసీల్దార్ కందుల కుశరాజు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు. ఈ కేంద్రం ద్వారా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 713 మంది బిఓఏ లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు (పిఓలు), సహాయ ప్రిసైడింగ్ ఆఫీసర్లు (ఏపిఓలు), 12 మంది వెబ్ కాస్టింగ్ సిబ్బంది, ఇతర ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందజేశారు. మండల పరిధిలో 186 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరుగుతుండగా అందులో 38 హైపర్ సెన్సిటివ్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. అనంతరం కేటాయించిన నిర్దేశిత బస్సు రూట్ల ద్వారా సిబ్బందిని, సామగ్రిని భద్రంగా తరలించినట్లు వారు పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఏవో మెహర్ ప్రకాష్, ఎంఈవోలు అప్పాజీ, రాజు, మండల వ్యవసాయ శాఖ అధికారిని బి.మీనా, ఇతర శాఖల అధికారులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ​ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని, ఓటర్లు అందరూ ధైర్యంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సహాయ రిటర్నింగ్ అధికారులు కోరారు. ఈనెల 29న(ఆదివారం) ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డ్ సభ్యుల ఎన్నిక నిమిత్తం పోలింగ్ జరుగుతుందన్నారు. అనంతరం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుందని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒక లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్