ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : ప్రధాని మోడి జన్మదినోత్సవ మహోత్సవాలు, సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా కొత్తపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఏ.గజలక్ష్మి సూచనలు మేరకు మండల పరిధిలోని జొన్నాడ అంగన్‌వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్ నాగ సత్యవేణి ఆధ్వర్యంలో అంగన్‌వాడీల అభినందన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలమూరు సెక్టార్ పరిధిలో చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహార ప్రాధాన్యం, పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలలో అంగన్‌వాడీ కేంద్రాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాల విద్యకు పునాది అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పడుతుందని తెలిపారు. అనంతరం అంగన్వాడి కార్యకర్త చేపల లక్ష్మి, హెల్పర్ మెరిపే రామలక్ష్మి ల సేవలను గుర్తించి స్థానిక ఏరియా మహిళలు వారిని ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,అంగన్వాడి కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, గర్భిణీలు, బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.
జొన్నాడలో ఘనంగా అంగన్‌వాడీల అభినందనోత్సవం
17 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 04:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)