ప్రజాశక్తి - ఆలమూరు : మండల పరిధి 18 గ్రామాలలో వాడవాడల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో ఏ.రాజు ఆధ్వర్యంలో ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు అధ్యక్షతన శనివారం ఘనంగా నిర్వహించారు. మడికి, చెముడులంక, చొప్పెల్ల, ఆలమూరు గ్రామాల ప్రత్యేక అధికారిగా ఉన్న ఆయన ముందుగా ఆయా పంచాయతీ కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జయప్రదం చేశారు. అలాగే రెవెన్యూ కార్యాలయం వద్ద తాహసిల్దార్ కందుల కుశరాజు ఆధ్వర్యంలో, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై జి.నరేష్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ సమగ్రత, ఐక్యతను చాటుతూ వికసిత భారత్ 2047, స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధన దిశగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలందరిలో పరిపూర్ణమైన దేశభక్తి భావాన్ని కలిగి ఉండాలని ఆయన సూచించారు. జాతీయ జెండా పట్ల గౌరవాన్ని చాటడమే మనందరి ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. దేశ యువత జాతీయ గీతాన్ని ఆలపిస్తూ, సమగ్ర అభివృద్ధి కోసం అడుగు వేస్తూ, ఐక్యత కోసం పాటుపడుతూ నిరంతర విద్యార్థిగా శ్రమించాలన్నారు. మండల పరిధిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డిసి చైర్మన్ మెర్ల గోపాలస్వామి, టిడిపి గ్రామ అధ్యక్షుడు దొండపాటి సుబ్బరాజు, మండల పరిషత్ ఏవో ఏం.వి.మెహర్ ప్రకాష్, ఎంఈఓ లు అప్పాజీ, రాజు, డిప్యూటీ ఎంపీడీవో ఎస్.వీర్రాజు, కార్యదర్శులు వెంకటరత్నం, దొరబాబు, రాజు, మోక్షంజలి అధికారులు, విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వాడవాడలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 03:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)