సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మంచు కాదండోయ్... రోడ్డంతా దుమ్మే..

4 గంటల క్రితం

It’s not mist, folks... the whole road is covered in dust!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 04:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • జొన్నాడ ఫ్లైఓవర్ సర్వీసు రోడ్డు దుస్థితి.

  • వాహనదారులు ప్రాణాపాయ స్థితిలో ప్రయాణం.

  • పట్టించుకోని ఎన్హెచ్ అధికారులు.


ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : 216 ఏ జాతీయ రహదారిపై 2023లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అట్టహాసంగా నిర్మాణ పనులు ప్రారంభించిన ఈ జొన్నాడ ఫ్లైవోవర్.. ఇప్పుడు దీని పేరు చెబితే వహనదారుల గుండెల్లో టెర్రర్.. మూడేళ్లుగా ఇక్కడ నిర్మా ణంలో ఉన్న ఫ్లైవోవర్ పనులపై అధికారులు, నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి ముందుకు సాగడం లేదు. దీనికి తోడు ఇటీవల సర్వీసు రోడ్లు అధ్వానంగా ఉండటంతో తక్షణం వాటిని నిర్మించాలని జిల్లా కలెక్టర్ మహేష్కు మార్, ఎంపీ హరీష్మాధుర్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు కొత్త కాంట్రాక్టర్ తో రోడ్లుకు శ్రీకారం చుట్టగా ఒక నెల రోజుల వ్యవధిలోనే నిర్మించి మమ అనిపించారు. దీంతో అవి నిర్మించినంత వ్యవధి గడవక ముందే శిధిలమయ్యాయి. ఇందులో రాజమండ్రి నుంచి జొన్నాడ సెంటర్కు వచ్చే రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీనికి తోడు మంచు దుప్పటిని తలపిస్తూ భారీగా దుమ్ము లేచి వాహనదారులకు నరకాన్ని తలపిస్తున్నాయి. ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో ప్రయాణీకులు వెళుతున్న హైవే ను అధికారులు పట్టించుకోక పోవడం గమనార్హం. ఇకనైనా అధికార యంత్రాంగం పరిస్థితి గమనించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


నిలిచిపోయిన ఫ్లైఓవర్ పనులు ?

జొన్నాడ ఫ్లైఓవర్ పనులను వచ్చే మార్చినాటికి పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా కొత్త కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. ఇక్కడి సర్వీసు రోడ్లను నాణ్యతా లోపాలతో చేసి చేతులు దులుపుకోవడంతో పాటు ఫ్లైవోవర్ పనులు సాఫీగా సాగించరన్న ఆరోపణలున్నాయి. అలాగే రాజమండ్రి వైపున అప్రోచ్ రోడ్డు పనులు చేశారు. అయితే వారం, పదిరోజులుగా పనులు పూర్తిగా నిలుపుదల చేశారు. దాదాపుగా పనులు నిలుపుదల చేసి వెళ్లిపోయినట్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో జొన్నాడ సర్వీసు రోడ్డుకు కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయని స్థానికులు, వాహనదారులు భావిస్తున్నారు. దీనిపై హైవే అధికారులు స్పందించి త్వరితగతిన పూర్తి చేయాలని వాహనదారులు పలువురు కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్