ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ప్రకారము జిల్లా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ డి.లక్ష్మీ ప్రత్యూష మండల ప్రజా పరిషత్ ప్రత్యేకాధికారిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఎంపీడీవో ఏ.రాజు ఆధ్వర్యంలో ఆమెకు ఘన స్వాగతం పలికి, దుస్సాలువ, ఇండోర్ ప్లాంట్ అందజేసి, అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల ప్రజా పరిషత్ ప్రజా ప్రతినిధుల పదవీకాలం ఈనెల 24 తో ముగిసిందన్నారు. దీంతో మండల పరిషత్తులకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ పదవీకాలం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి ప్రజా ప్రతినిధులు బాధ్యతలు స్వీకరించేంతవరకు కొనసాగుతుందన్నారు. అప్పటివరకు మండల అభివృద్ధికి స్థానిక అధికారులు, కూటమి నాయకులు సమన్వయంతో వ్యవహరిస్తూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఏవో మెహర్ ప్రకాష్, ఇంచార్జ్ డిప్యూటీ ఎంపీడీవో యు.రేణుక, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ సతీష్, కంప్యూటర్ ఆపరేటర్ వలీ, నాయకులు నెక్కంటి సూర్య ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
మండల ప్రజాపరిషత్ ప్రత్యేక అధికారిగా లక్ష్మీ ప్రత్యూష బాధ్యతలు స్వీకరణ
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 04:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)