మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికైన ఎస్ఎంసి కమిటీలకు నేతల అభినందన

12 గంటల క్రితం

aalamuru-2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 04:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : మండల పరిధి 18 గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో మంగళవారం స్కూల్ మోనిటరింగ్ కమిటీ (ఎస్ఎంసి)ల ఎన్నికలు ఆయా పాఠశాలల హెచ్ఎంల ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగిసాయి. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షుడు ఈదల సత్తిబాబు ఎన్నికైన కమిటీ సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే స్కూల్ అభివృద్ధిలో వారంతా కీలకపాత్ర పోషిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేయాలని ఆకాంక్షించారు. అలాగే పలువురు కూటమి నాయకులు స్థానికంగా ఎన్నికైన కమిటీలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్