మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సూర్యారావుపేట స్థితిగతులను పరిశీలించిన ఎంపీడీవో

2 గంటల క్రితం

MPDO inspects conditions in Suryaraopeta
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 02:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండలంలోని సూర్యారావుపేట గ్రామ పరిధిలో ప్రస్తుత స్థితిగతులను ఎంపీడీవో ఏ.రాజు, స్థానిక టిడిపి సీనియర్ నేత కాలా సాయిబాబాతో కలిసి క్షేత్రస్థాయిలో మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో కొన్ని మార్గాలు సిసి రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. అలాగే ఎస్సీ కాలనీలో త్రాగునీటి సౌకర్యం సరిగా లేదని, స్థానికంగా నూతన వాటర్ ట్యాంకు నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించామన్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న వెల్నెస్ సెంటర్ భవనాన్ని పరిశీలించినట్లు తెలిపారు. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గ్రామంలో పోలింగ్ బూతుల అనుకూలతను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందన్నారు. గుర్తించిన సమస్యలను ఉన్నతాధికారులకు, స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దృష్టికి తీసుకుని వెళ్లినట్లు అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు. అనంతరం ఎంపీడీవో రాజు పంచాయతీ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తు పలు సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శివ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్