ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : గ్రామాలు, వార్డుల్లో పోలీసులు నిర్వహిస్తున్న పల్లెనిద్ర కార్యక్రమంతో ప్రజలకు మరింత భరోసా కల్పిస్తున్నామని రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్.విద్యాసాగర్, ఆలమూరు ఎస్ఐలు జి.నరేష్, సూర్యచంద్రరావు తెలిపారు. శుక్రవారం రాత్రి చెముడులంక పంచాయతీ కార్యాలయంలో వారు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం చేపట్టారు. అధికారులు ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె నిద్ర కార్యక్రమంతో ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని కలిగిస్తున్నామన్నారు. నేరాల నియంత్రణ, ప్రజల సహకారంతో పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయడమే పల్లె నిద్ర ప్రధాన లక్ష్యమని అన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు పెద్ద నేరాలుగాను, శాంతిభద్రతల సమస్యగా మారే అవకాశముందని, ఇలాంటి అంశాలను క్షేత్ర స్థాయిలో గుర్తించి, చర్యలు చేపడుతున్నామన్నారు. పోలీసు స్టేషన్లుకు వెళ్ళకుండానే వారి సమస్యలను నేరుగా పోలీసు అధికారులకు తెలిపేందుకు ‘పల్లెనిద్ర’ ఒక వేదికగా నిలుస్తుందన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విషయాలను, గ్రామంలో వివిధ రాజకీయ పార్టీల మధ్యగల విభేదాలను, భూతగాదాలను క్షేత్ర స్థాయిలో గుర్తించి, శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసేందుకు, ప్రజలకు రక్షణగా నిలిచే చట్టాలు, సైబరు మోసాలు, మహిళలు, రహదారి భద్రతపట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వారు తెలిపారు.
పల్లె నిద్రతో ప్రజలకు మరింత భరోసా : సిఐ విద్యాసాగర్, ఎస్ఐ నరేష్
29 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 29, 2026, 03:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)