ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీజనార్దన స్వామి వారి ఆలయంలో ఆశ్వయుజ శుద్ధ సప్తమి శనివారం స్వామివారికి తోమాల సేవ, ఆలయానికి తరలివచ్చిన యాత్రికులకు ప్రసాద వితరణ సేవలందించిన ఏపీటిఎఫ్ మండల అధ్యక్షుడు అద్దరి శ్రీనివాసరావు, వెంకట జ్యోతి దంపతులు, వారి కుమారులు సాయి విద్యాధర్, శశాంక్ సూర్య వర్షిత్ లకు ఆలయ చైర్మన్ బైరిశెట్టి రాంబాబు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. స్వామివారికి తోమాల సేవ నిర్వహించడంతో పాటు యాత్రికులకు ప్రసాద వితరణ కార్యక్రమాల్లో విశేష సేవలు అందించినందుకు గాను అద్దరి దంపతులను చైర్మన్ రాంబాబు ఈ సందర్భంగా అభినందించారు.
తోమాల సేవకులకు జనార్దనస్వామి చిత్రపటం అందజేత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 17, 2026, 03:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)