ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : గణేష్ నిమజ్జన కార్యక్రమాలలో నిబంధనలు పాటిస్తూ, వివాదాలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని అమలాపురం అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తె, కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్ సూచించారు. మండలంలోని మూలస్థానం అగ్రహారంలో జరుగుతున్న గణేష్ నిమజ్జన ఊరేగింపును వారు ఆకస్మికంగా పరిశీలించారు. అలాగే గణేష్ ఉత్సవ నిర్వాహకులతో స్వయంగా మాట్లాడి నిమజ్జన ఏర్పాట్లపై క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. నిమజ్జన ఊరేగింపు సమయంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీసుల సూచనలను పాటిస్తూ ప్రశాంతంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని వారు సూచించారు. నిమజ్జన సందర్భంగా గ్రామ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే నిమజ్జన కార్యక్రమం సమయంలో ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పోలీసు సిబ్బంది ప్రత్యేక బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జి.నరేష్, అడిషనల్ ఎస్సై డి.సూర్యచంద్రరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గణేష్ నిమజ్జనాలలో నిబంధనలు పాటించాలి : జిల్లా అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తె, కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్
17 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 04:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)