మెగా లెజెండ్స్ సంస్థ ప్రెసిడెంట్ భీమేశ్వర రెడ్డి
ప్రజాశక్తి - ఆలమూరు : భావి భారత మహిళలుగా ఎదగనున్న విద్యార్థినిలు భవిష్యత్ పురోగతి కోసం మెగా లెజెండ్స్ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ ప్రెసిడెంట్ భీమేశ్వర్ రెడ్డి సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు మాజీ సర్పంచ్ నాగిరెడ్డి వెంకటరత్నం హెచ్ఎం శివరాంకుమార్ అన్నారు. మండలంలోని ఎస్ టి ఎస్ ఎన్ ఎం జడ్పీ హైస్కూల్ కి స్వచ్ఛంద సంస్థ వితరణ చేసిన నాలుగు కుట్టు మిషన్లను శనివారం వారు ప్రారంభించారు. ఈ మిషన్లకు సుమారు రూ.60,000 వెచ్చించి కొనుగోలు చేసినట్లు, ఇందులో మూడు సాధారణ మిషన్లు కాగా ఒకటి జిగ్జాగ్ మిషన్ అని సంస్థ అధినేతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. ఈ సంస్థ ద్వారా మహిళల అభ్యున్నతికి పలుచోట్ల కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించి వారికి ఉచితంగా కుట్టు మిషన్లు వితరణ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం హైస్కూల్లో విద్యార్థినుల పైనే దృష్టి సారించి వివిధ హైస్కూల్లో కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాలు ప్రారంభించి, మిషన్లు అందజేస్తున్నట్లు వారు తెలిపారు. దీనిపై స్థానిక నేతలు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ సంస్థ మహిళలకు ప్రత్యేకంగా చేస్తున్న సేవలను కొనియాడారు. అలాగే మరింతగా రాణిస్తూ ఈ స్వచ్ఛంద సంస్థ అభివృద్ధి పథంలో నడవాలని వారంతా ఆకాంక్షించారు. దీంతో సంస్థ స్థిరపడి పలువురి అభివృద్ధికి దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు నాగిరెడ్డి సత్యానందం, తిరణాతి వెంకటేశ్వరరావు, అడబాల వీర్రాజు, సిరంగుల సతీష్, ఎంపిటిసి తమ్మన భాస్కరరావు, గుండుమల్ల రాంబాబు, ఉపాధ్యాయులు చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)