శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సిద్ధార్థలో ఘనంగా తెలుగు భాష దినోత్సవం

1 గంట క్రితం

Telugu Language Day Celebrated Grandly at Siddhartha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 03:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండల కేంద్రంలోని శ్రీ సిద్ధార్థ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని పాఠశాల డైరెక్టర్ కె.ముల్లారావు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల డైరెక్టర్ వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు, భాషావేత్త అయినా గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటం కు పూలమాలవేసి నివాళులర్పించారు. తెలుగు భాష వ్యవహారిక రూపం రావడానికి గిడుగు వారి కృషి ఎనలేనిదన్నారు. తల్లి లాంటి తెలుగు భాషను మనం మరవరాదన్నారు. తెలుగు భాష గ్రాంధిక రూపం నుంచి వ్యవహారిక రూపం రావడానికి ఆయన చేసిన కృషి మరవరాదని అన్నారు. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా అలాంటి వ్యక్తిని స్మరించాలన్నారు. తదనంతరము తెలుగు భాష దినోత్సవం సందర్భంగా పాఠశాలలో మాతృభాషా పరిరక్షణ సేవా సమితి, పెరవలి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేమన పద్యాల పోటీని ఆయన తిలకించి విద్యార్థులను ప్రశంసించారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల ఆసక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. అనంతరం నిర్వహించిన వివిధ సాంస్కృతి కార్యక్రమాలు అందర్నీ ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో ప్రైమరీ ప్రిన్సిపల్ జేసీనా జోసెఫ్, హైస్కూల్ ప్రిన్సిపల్ విష్ణు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్