ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు : సిఐ విద్యాసాగర్, ఎస్సై నరేష్

17 గంటల క్రితం

Tight security arrangements for the conduct of elections CI Vidyasagar SI Naresh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 05:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండలంలో నవంబర్ 29న జరగనున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఈ మేరకు శనివారం రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్. విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై జి.నరేష్ స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద సిబ్బందికి కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. మండల పరిధిలో 186 పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లుకు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట భద్రత కల్పించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజాస్వామ్య బద్దంగా, నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సీఐ, ఎస్సై పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్