గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

లివర్ శిరోసిస్ వ్యాధిపై అప్రమత్తత అవసరం : వెటర్నరీ ఎడి సత్యనారాయణరావు

2 రోజుల క్రితం

లివర్ శిరోసిస్ వ్యాధిపై అప్రమత్తత అవసరం  : వెటర్నరీ ఎడి సత్యనారాయణరావు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 11:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : పశువులకు వచ్చే లివర్ శిరోసిస్ వ్యాధిపై పాడి రైతులు అప్రమత్తంగా వ్యవహరించి వైద్యులను సంప్రదించాలని వెటర్నరీ ఏడి డాక్టర్ బి.వి.వి.వి సత్యనారాయణరావు తెలిపారు. మండలంలోని పెనికేరు పశు వైద్యశాలలో లివర్ శిరోసిస్ వ్యాధి కారణంగా గేదె పొట్ట క్రింద భాగంలో చేరిన నీటిని సిరంజ్ సూదులతో స్థానిక పశు వైద్యులు డాక్టర్ డి.భాను ప్రసాదరావు తొలగించి మంగళవారం ఆ గేదెకు ప్రత్యేక వైద్య సేవలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లివర్ సిరోసిస్ వ్యాధి వల్ల లివర్ దెబ్బతిని పశువులకు ప్రాణపాయం సంభవించే అవకాశం ఉందన్నారు. పాడి రైతులు తమ పశువుల పెంపకం కోసం ఈ వర్షాకాలం సీజన్లో అప్రమత్తంగా చూసుకోవాలని వారు కోరారు. అనంతరం రైతులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్