ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి : జడ్పీ సీఈఓ వసంత మాధవి, ఆర్డిఓ సత్యనారాయణ

17 గంటల క్రితం

Elections must be conducted in a peaceful atmosphere ZP CEO Vasantha Madhavi, RDO Satyanarayana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 05:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జడ్పీ సీఈఓ వసంత మాధవి, ఆర్డిఓ సత్యనారాయణలు స్థానిక మండల ఎన్నికల అధికారులకు ఆదేశించారు. ఈ నెల 29న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మండల కేంద్రం ఆలమూరులోని పోలింగ్ కేంద్రం కౌంటింగ్ కేంద్రాలను వారు స్థానిక ఎన్నికల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. అలాగే పోలైన ఓట్లతో బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకునే సమయానికి కావలసిన మౌలిక వసతుల కల్పనపై అధికార సిబ్బందిని ఆరా తీశారు. అలాగే ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రాల అనుకూలత తదితర అంశాలు వారి తనిఖీలో ఉన్నాయి. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రాండమ్(ఆకస్మిక) పరిశీలన చేసినట్లు వారు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఏఆర్వోలు ఎంపీడీవో ఏ.రాజు తహసీల్దార్ కందుల కుశరాజు, ఎంఈఓ లో అప్పాజీ, రాజు, సిబ్బంది పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్