చిన్నతుంబళం ఎంపీటీసీ-2 అభ్యర్థి మార్తమ్మకు మద్దతివ్వాలి
రైతు సంఘం మండల కార్యదర్శి హనుమంతు
ప్రజాశక్తి - పెద్దకడబూరు: మండలంలోని, చిన్నతుంబళం గ్రామంలో పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే పార్టీ సీపీఎం అని రైతు సంఘం మండల కార్యదర్శి కె. హనుమంతు అన్నారు. పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో సీపీఎం తరఫున ఎంపీటీసీ-2 అభ్యర్థిగా పోటీ చేస్తున్న హరిజన మార్తమ్మ కు గ్రామ ప్రజలు మద్దతు తెలపాలని ఆయన కోరారు. మంగళవారం గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మార్తమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బాపురం, చిన్నతుంబళం గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల సాధన కోసం సీపీఎం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఆదోని నుంచి గ్రామానికి బస్సు సౌకర్యం రావడానికి సీపీఎం చేసిన పోరాటమే కారణమని పేర్కొన్నారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి, పోరాటం ద్వారా గ్రావెల్ రోడ్లు వేయించామని వివరించారు.గతంలో గెలిచిన పాలకులు ఎన్నికల అనంతరం ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని విమర్శించారు. తిరిగి ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులను ప్రజలు నిలదీయాలని అన్నారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.ఎన్నికల సమయంలో కొంతమంది నాయకులు డబ్బులు పంపిణీ చేసినా, ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, విచక్షణతో వినియోగించుకోవాలని హనుమంతు సూచించారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలను పరిశీలించి అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు. సీపీఎం అభ్యర్థి మార్తమ్మకు ఎన్నికల గుర్తు "సుత్తి కొడవలి నక్షత్రం" పై ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాపురం హనుమంత్ రెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి యు. ఈరన్న, డివైఎఫ్ఐ రాజు, కెవిపిఎస్ మండల అధ్యక్షుడు దాసు, బసలదొడ్డి వెంకటేశులు, రాముడు, రామంజిని, కామవరం వీరేష్, హరిజన వనూరప్ప, తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)