ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్ : మాజీ ఎమ్మెల్యే ఎంఎ గఫూర్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నిర్మల పెద్ద కుమారుడు పివి.కిరణ్ ఈ నెల 1 న అమెరికాలో గుండెపోటుతో మరణించగా, ఆయన భౌతికకాయాన్ని సోమవారం తెల్లవారుజామున కర్నూలుకు చేర్చారు. ప్రజల సందర్శనార్థం పార్థీవదేహాన్ని కర్నూలు సుందరయ్య భవన్ లో ఉంచారు. పలువురు ఆయనకు నివాళులు అర్పించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరావు, ఉమామహేశ్వరరావు, వి.రాంభూపాల్ నివాళులు అర్పించారు. వ్య.కా.స అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవి.నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి బి.సావిత్రి, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎంఎ.చిస్తీ, అధ్యక్షులు ఎస్ఎ.సుభాన్, పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కిరణ్ భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కిరణ్ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం సంగినేని పల్లెలో నిర్వహించనున్నారు.








కామెంట్లు (0)