చిన్నతుంబళంలో సీపీఎం ఎంపీటీసీ అభ్యర్థి మార్తమ్మ పర్యటన
పెద్దకడబూరు (కర్నూలు) : పెద్దకడబూరు మండల పరిధిలోని, చిన్నతుంబళం, బాపురం గ్రామంలోని కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీటీసీ-2 సీపీఎం అభ్యర్థి హరిజన మార్తమ్మ అన్నారు. శనివారం ఆమె గ్రామంలోని పలు కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను ఎంపీటీసీగా గెలిపిస్తే గ్రామ సమస్యలను మండల సర్వసభ్య సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఈ. తిక్కన్న మాట్లాడుతూ గత పాలకులు కాలనీల్లో మురుగునీటి సమస్యలు, దుర్వాసన, పారిశుద్ధ్య సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. అధికారులు కూడా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసే నాయకులు గెలిచిన తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటు వేసి హరిజన మార్తమ్మను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో కె. హనుమంతు, బాపూరం హనుమంతు రెడ్డి, యు. శ్రీనివాసులు, సీఐటీయూ మండల కార్యదర్శి యు. ఈరన్న, డీవైఎఫ్ఐ నాయకులు జి. రాజేంద్రకుమార్, కేవీపీఎస్ మండల కార్యదర్శి దాసు, బాబు, రామన్న, సీపీఎం కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)