ప్రజాశక్తి-చందర్లపాడు (ఎన్టిఆర్) : మండల కేంద్రమైన చందర్లపాడులోని స్థానిక బస్టాండ్ సెంటర్ లో బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ కమల మాట్లాడుతూ జులై 31వ తేదీన స్కీం వర్కర్లు అయిన అంగన్వాడి ,ఆశా ,మధ్యాహ్నం భోజనం, కార్మికులు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ,పెన్షన్,పిఎఫ్ ఈ ఎస్ఐ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున కార్మిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన తెలియజేయడానికి సిద్ధమవుతున్నారని ఆమె అన్నారు.పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యవసర సరుకులు ధరలు పెరిగాయని, దీనికి అనుగుణంగా కార్మికుల వేతనాలు కూడా పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.వేతనాలు పెంచి ఏడు సంవత్సరాలు అవుతున్నా ప్రభుత్వాలు కార్మికుల వేతనాలు పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా అనేక సంవత్సరాలుగా కార్మికుల పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చిందని, వీటిని మన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి అమలకు పూనుకోవడం దుర్మార్గం అని ఆమె అన్నారు. లేబర్ కోడ్ లను అమలు చేయడం కార్మికుల వేతనాల పైన సామాజిక భద్రత పైన దాడి జరుగుతుందని సమ్మె చేసే హక్కు లేకుండా చేయటం పిఎఫ్ ఈ ఎస్ఐ పెన్షన్ వంటి సంక్షేమ పథకాలకు ఎగనామం పెట్టడం వంటివి జరుగుతాయి అన్నారు. కార్మికుల హక్కులను హరిస్తున్న, ఈ నాలుగు లేబర్ కోడ్ లను ప్రభుత్వాలు రద్దు చేయాలంటే కార్మికులందరూ ఐక్యంగా ప్రకటించాలని ఆమె పిలుపునిచ్చారు.అంతేకాకుండా పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 అమలు చేయకుండా, కార్మికుల యొక్క శ్రమను దోచుకుంటున్నారని, కార్మికులు సమస్యల పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేదని ప్రభుత్వాలు మారుతున్నా కానీ పాలకుల విధానాలను మాత్రం మారడం లేదని ఆమె ఆరోపించారు. ఈ ప్రమాదాన్ని కార్మికులు అర్థం చేసుకోకపోతే నష్టపోతారని, ఈ నేపథ్యంలో కనీస వేతనాలు పెంపు, లేబర్ కోడ్ ల రద్దు కై అందరూ కలిసి జూలై 31 తేదీన విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో జరిగే జిల్లా ధర్నా కార్యక్రమంలో స్కీం వర్కర్లు అందరూ పెద్ద ఎత్తు పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కటారపు గోపాల్, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు వేల్పుల రాణి, కస్తాల మరియమ్మ, k.మేరీ, టైలర్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్.కె కరీం తదితరులు పాల్గొన్నారు.
జులై 31 వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయండి : సిఐటియు జిల్లా కార్యదర్శి, ఎ.కమల
9 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 29, 2026, 03:18 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)