రెడ్డిగూడెం (ఎన్టిఆర్) : మున్సిపల్ రంగంలో పౌర సేవలు ప్రైవేటీకరణ తక్షణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, హైకోర్టు ఉత్తర్వులు అనుసరించి మున్సిపల్ కార్మికులు పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ .... మంగళవారం కొండపల్లి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో బ్యాంక్ సెంటర్ వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి ఎం మహేష్ మాట్లాడుతూ .... మున్సిపల్ కార్మికులు సమస్యలు - డిమాండ్స్ పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా ఈ విషయమై చర్చించాలని లేనిపక్షంలో మున్సిపల్ కార్మికులు అసెంబ్లీ కి రావాల్సి వస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
: డిమాండ్స్ :
1. మున్సిపల్ రంగంలో పౌర సేవల ప్రైవేటీకరణ ఉపసంహరించాలి.
2. హైకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి.
3. 12 వ పిఆర్సి కమీషను వెంటనే ఏర్పాటుచేయాలి.
4. మధ్యంతరభృతి వెంటనే ప్రకటించాలి.
5. గత 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ళకు పెంపు. ఎక్స్రేషియో రూ. 5 లక్షల నుండి 7 లక్షలకు పెంపు, హెల్త్ కార్డులు మొదలైన వాటికి జీఓలు జారీ చేయాలి.
6. మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులకు హెచ్ ఆర్ పాలసీ అమలు, వీరి శ్రమను గుర్తిస్తూ అన్ని రకాల షరతులు మినహాయించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
7.1972 గ్రాట్యుటీ చెల్లింపు చట్టం ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలి.
8. పర్మినెంట్ సిబ్బందికి సరండర్ లీవ్లు, డిఎ బకాయిలు వెంటనే చెల్లించాలి.
9. ఆప్కాస్ లోని ఒప్పంద కార్మికులు రిటైర్మెంట్, దీర్ఘకాలిక అనారోగ్యం లేదా మరణించిన వారి స్థానంలో వారి పిల్లలకు ఉ ద్యోగాలు ఇవ్వాలి.
10. ఎన్ఎంఆర్, డైలీవేజ్, బదిలీ, కోవిడ్, అడిషనల్ వర్కర్స్, ఎం బుక్, క్లాప్ డ్రైవర్లు మరియు సులభ కాంప్లెక్స్ వర్కర్స, రిక్షా పుల్లర్స్ తదితర పేర్లతో పనిచేస్తున్నవారందరికీ 2016 అక్టోబర్లో సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.
11. మున్సిపల్ క్వార్టర్స్ మరమ్మతులు చేయించాలి.
12. అర్హులైన మున్సిపల్ కార్మికులందరికీ ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు కేటాయించాలి.








కామెంట్‌లు (0)