సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పొంగి ప్రవహిస్తున్న బుడమేరు

3 రోజుల క్రితం

పొంగి ప్రవహిస్తున్న బుడమేరు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 08:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి-మైలవరం : ‘అర్ణబ్’ తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బుడమేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాలైన ఏ.కొండూరు, తిరువూరులతో పాటు ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుండటంతో వాగులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రెండు సంవత్సరాల క్రితం బుడమేరు తెచ్చిన ముంపును గుర్తుచేసుకుంటూ మైలవరం, విజయవాడ, ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మైలవరం మండలంలోని చిల్లకల్లు వారిగూడెం బ్రిడ్జి, పుల్లూరు - జమలాపురం రహదారిలోని బ్రిడ్జిలతో పాటు వెల్వడం బైపాస్ రింగ్ రోడ్డు బ్రిడ్జిని ఆనుకొని వరద ప్రవహిస్తోంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు వణికిపోతున్నారు. ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా అధికారులు తక్షణమే స్పందించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్