శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మూడు పంచాయతీలు ఏకగ్రీవం 15 పంచాయతీల్లో పోటీ

6 రోజుల క్రితం

మూడు పంచాయతీలు ఏకగ్రీవం 15 పంచాయతీల్లో పోటీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 09:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ ప్రజాశక్తి-మామిడికుదురు: మామిడికుదురు మండల పరిధిలో 18 గ్రామాలకు గాను మూడు పంచాయితీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 15 పంచాయితీల పాలకవర్గాలకు ఈనెల 26న ఎన్నికలు జరగనున్నాయి. ఈదరాడ, బి.దొడ్డవరం సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డ్ మెంబర్లు ఏకగ్రీవం కాగా, పెదపట్నంలో సర్పంచ్ తో పాటు ఏడు వార్డులు ఏకగ్రీవంగా అయ్యాయి. మిగిలిన 5 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈదరాడ సర్పంచ్ గా చిక్కం ఉమామహేశ్వరి రాంబాబు, బి.దొడ్డవరం సర్పంచ్ గా పాబోలు రోజా రాణి కృష్ణ మదన్, పెదపట్నం సర్పంచ్గా కొమ్ముల నందేశ్వరరావులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. మొత్తం 18 గ్రామాలలో 212 వార్డులకు గాను 71 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని, 141 వార్డులకు 302 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ఎన్నికల జరగనున్న 15 గ్రామాల సర్పంచ్ పోటీలకు 40 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఎంపిడిఒ జి.భవాని తెలిపారు.

​​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్