ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి
విజయవాడ నగరపాలక సంస్థ 30వ డివిజన్‌లో సిపిఎం విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయని సీపీఎం అభ్యర్థి దొనేపూడి కాశీనాథ్ తెలిపారు. డివిజన్ పరిధిలో ఇప్పటికే 70 శాతం మేర ఇంటింటి ప్రచారం పూర్తయిందని, ఓటర్ల నుంచి విశేష స్పందన లభిస్తోందని చెప్పారు. గత 15 ఏళ్లుగా డివిజన్ తీవ్ర వెనకబాటుతనానికి గురైందని, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నాశనమై కొద్దిపాటి వర్షానికే రోడ్లు జలమయమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 1,158 మంది నిరుపేదల గృహ పట్టాల రిజిస్ట్రేషన్ సమస్యను ప్రభుత్వం నాటకాలతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. స్వర్గపూర్ రోడ్ల విస్తరణ, మెట్రో రైల్వే ప్రాజెక్ట్ మార్కింగ్‌ల పేరుతో ప్రజా ఆస్తులకు ముప్పు వాటిల్లకుండా కమ్యూనిస్టులే పోరాడగలరని స్పష్టం చేశారు. తాము గెలిచాక నివాస స్థలాల రిజిస్ట్రేషన్, డ్రైనేజీ వ్యవస్థ పునర్నిర్మాణం, రోడ్ల విస్తరణ నుంచి ఆస్తుల సంరక్షణే ప్రధాన అజెండాగా పనిచేసి 30వ డివిజన్‌ను మోడల్ డివిజన్‌గా తీర్చిదిద్దుతామని ఓటర్లను కోరారు.










కామెంట్‌లు (0)