ప్రజాశక్తి - విజయవాడ అర్బన్
ప్రముఖ బంగారు, వజ్రాభరణాల రిటైల్ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ బందర్ రోడ్డులోని తన షోరూంలో ‘బ్రైడల్ జ్యువెలరీ షో’ను శుక్రవారం ఘనంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా షోరూం మార్కెటింగ్ మేనేజర్ ఖాసిం మాట్లాడుతూ, అక్టోబర్ 28న ప్రారంభమైన ఈ ప్రత్యేక ప్రదర్శన నవంబర్ 7, 2026 వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.నవ వధువుల కోసం ప్రత్యేకంగా ‘షో ద వే’ ఇతివృత్తంతో రూపొందించిన ఈ ప్రదర్శనలో విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలను ప్రతిబింబించే వివాహ ఆభరణాలను కొలువుదీర్చినట్లు పేర్కొన్నారు. వీరి ప్రత్యేక ఉప-బ్రాండ్లు డివైన్, మైన్, ఎరా కలెక్షన్లను కూడా ప్రదర్శిస్తున్నామని వివరించారు. ‘వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్’ విధానంతో పాటు 100 శాతం బిఐఎస్ హాల్‌మార్క్ బంగారం, ఐజిఐ/జిఐఎ ధృవీకరించిన వజ్రాలు, ఉచిత జీవితకాల నిర్వహణ వంటి 12 రకాల కస్టమర్ వాగ్దానాలను అందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భవ్య, మనీషా, జీవని, దీపిక, షోరూం సిబ్బంది పాల్గొన్నారు.
-








కామెంట్‌లు (0)