ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం
జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యూజెఎఫ్) ప్రధాన ధ్యేయమని జర్నలిస్టు నాయకులు పేర్కొన్నారు. ఎపిడబ్ల్యూజెఎఫ్ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని ఫెడరేషన్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిబిజెఎ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెరుగుమాల రాఘవులు పాల్గొని కేక్ కట్ చేసి జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు ఫెడరేషన్ చేస్తున్న కృషిని రాఘవులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎపిడబ్ల్యూజెఎఫ్ మైలవరం నియోజకవర్గ గౌరవాధ్యక్షులు టంగుటూరి శ్రీనివాస్, నియోజకవర్గ అధ్యక్షులు షేక్ సల్మాన్, కోశాధికారి కాలగడ్డ మనోహర్, జిల్లా కమిటీ సభ్యులు వేముల నాగరాజు, పల్లె నరేష్, ఎపిబిజెఎ మైలవరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దాసి ప్రతాప్, ఉపాధ్యక్షులు మలమంటి రమేష్, సభ్యులు బి.వంశీ, అస్రఫ్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)