విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: సిపి
ప్రజాశక్తి-విజయవాడ
ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలవుతున్న నేపథ్యంలో గెలుపొందిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, డప్పు వాయిద్యాల ప్రదర్శనలు నిర్వహించడానికి ఎలాంటి అనుమతి లేదని ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు భంగం కలిగించేలా బాణసంచా కాల్చడం, అధిక శబ్దంతో కూడిన డిజెలు, మైక్ సెట్లను ఉపయోగించడంపై నిరోధం ఉందన్నారు. ప్రస్తుతం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నాయని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ర్యాలీలు తీసినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా నిందితులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు అభ్యర్థులు, నాయకులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.








కామెంట్‌లు (0)