ప్రజాశక్తి - ఎడ్యుకేషన్
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ నెల 12 నుంచి 16 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి ఏరోబిక్స్ జిమ్నాస్టిక్స్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున విజయవాడ మొగల్రాజపురంలోని వీరమాచనేని పద్దయ్య సిద్ధార్థ పబ్లిక్ స్కూల్‌కు చెందిన నలుగురు విద్యార్థినులు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ మేడా సీతారామయ్య తెలిపారు. జిల్లా జిమ్నాస్టిక్స్ సంఘం ఈ ఎంపికలను అధికారికంగా ప్రకటించిందని పేర్కొన్నారు. నేషనల్ డెవలప్‌మెంట్ విభాగంలో నాలుగో తరగతికి చెందిన దియా పాలకుర్తి, వదిపిన ఆద్విక ఎంపిక కాగా, యువజన విభాగంలో ఎనిమిదో తరగతి విద్యార్థిని జాహ్నవి కొల్లిపర, ఏడో తరగతి విద్యార్థిని అనన్య వేమూరి చోటు దక్కించుకున్నారని వివరించారు. జాతీయ స్థాయి పోటీలకు తమ పాఠశాల విద్యార్థినులు ఎంపిక కావడం పట్ల పాఠశాల యాజమాన్యం తీవ్ర హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ కె. రోజ్ మేరీ, ప్రధానోపాధ్యాయురాలు జయలక్ష్మి, అకాడమిక్ కోఆర్డినేటర్ డి. అనురాధ ఎంపికైన విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ పోటీల్లో ప్రతిభ చాటి పతకాలు సాధించడం ద్వారా రాష్ట్రానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న జిల్లా జిమ్నాస్టిక్స్ సంఘం కార్యదర్శి బి. బాబురావు, కోశాధికారి ఎల్. మురళీకృష్ణలకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.








కామెంట్‌లు (0)