శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అంబేద్కర్ ఆశయాలకు గౌరవంగానే కళావేదికలో ప్రమాణ స్వీకారం : ఎంపి చిన్ని

6 రోజుల క్రితం

విజయవాడ నగరంలో కూటమికి భారీ విజయం
అంబేద్కర్ కళావేదికలోనే మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం:
 విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 07:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం


ప్రజాశక్తి - విజయవాడ

ప్రజలు ఎన్డీఏ కూటమిపై విశ్వాసం ఉంచి భారీ మెజారిటీతో అత్యధిక కార్పొరేటర్లను గెలిపించారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన అంబేద్కర్ కళావేదికలో ఈ నెల 23న మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు గౌరవం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ వేదికను ఎంపిక చేశామని, ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ల కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించామని వెల్లడించారు.

నూతన మేయర్ వంగవీటి రాధా మాట్లాడుతూ.. ప్రమాణ స్వీకార వేదికపై కొందరు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, ముందుగా నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. అంబేద్కర్ పేరు మీద నిర్మించిన ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం నిర్వహించడం ద్వారా ఆయన ఆశయాలకు గౌరవం ఇస్తున్నామని, దీనిని అవమానంగా చిత్రీకరించడం సరికాదన్నారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. ప్రజలు కూటమికి అందించిన ఘన విజయాన్ని అంబేద్కర్‌కు అంకితం చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు కులమతాల మధ్య విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేయడం తగదని విమర్శించారు.​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్