ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల కోసం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) పివిజె రామారావు తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కనీసం ఐదేళ్ల నిరంతర సేవ పూర్తి చేసిన ఉపాధ్యాయులు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. దరఖాస్తుదారులపై ఎలాంటి శాఖాపరమైన అభియోగాలు, సివిల్ లేదా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారు. ఆసక్తి గల అర్హులైన ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను ఈ నెల 12 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కార్యాలయానికి సమర్పించాలని సూచించారు.
పల్నాడు జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
06 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 06, 2026, 04:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)