సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒంగోలులో దీపావళి టపాసుల సందడి

13 గంటల క్రితం

prakasa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 07:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- నెల్లూరు బస్టాండ్ మున్సిపల్ గ్రౌండ్‌లో 40కి పైగా బాణాసంచా దుకాణాలు

- కొనుగోళ్లకు తరలివస్తున్న ప్రజలు

ప్రజాశక్తి - ఒంగోలు సిటీ : దీపావళి పండుగ నేపథ్యంలో ఒంగోలు నగరంలో బాణాసంచా సందడి నెలకొంది. నగరంలోని నెల్లూరు బస్టాండ్ మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన టపాసుల విక్రయ కేంద్రం కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. గతంలో పీవీఆర్ గ్రౌండ్‌లో నిర్వహించిన బాణాసంచా విక్రయాలను ఈసారి నెల్లూరు బస్టాండ్ వద్ద ఉన్న గ్రౌండ్‌కు మార్చారు. ఇక్కడ 40కి పైగా దుకాణాలను ఏర్పాటు చేయడంతో టపాసుల కొనుగోళ్లకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వివిధ రకాల బాణాసంచా, చిచ్చుబుడ్లు, మతాబులు, రాకెట్లు, కాకరపువ్వొత్తుల కొనుగోళ్లతో విక్రయ కేంద్రం సందడిగా మారింది. నిన్నటి వరకు ఎన్నికల మూడ్ లో ఉన్న నగర ప్రజలు దీపావళి వేడుకలు నిర్వహించడం కోసం ఉత్సాహం చూపుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్