ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్షించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న వేడుకలకు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఆహ్వాన పత్రికలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వేదిక, పరేడ్, సీటింగ్, బారికేడింగ్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, పార్కింగ్ తదితర ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు, అత్యవసర సేవలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. వేడుకలకు హాజరయ్యే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. పరేడ్‌లో పాల్గొనే పోలీసు, ఎన్‌సీసీ, విద్యార్థులు, ఇతర బృందాలకు అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్ఓ అద్దయ్య, ఆర్డీఓ బాలకృష్ణ, సీపీఓ ప్రసాద్, కలెక్టరేట్ ఏఓ నాగిరెడ్డి, డీఎస్ఓ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన, ఏపిసి శ్యాంప్రసాద్, జిసీడీఓ రేవతి తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్ర్య వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి...
07 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 07, 2026, 03:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)