ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట పట్టణం వినుకొండ రోడ్డులో ఉన్న ఎన్‌ఎస్‌బీ కార్ డెకార్స్‌లో మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో అక్కడే ఉన్న నాలుగు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. కార్ డెకార్స్ కు పక్కనే ఉన్న ఓ బిర్యానీ సెంటర్ కు సైతం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కార్ డెకార్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 18, 2026, 12:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)