ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : హైదరాబాద్ లో ఈ నెల 22న నిర్వహించిన భారత విద్యా సదస్సులో కె-రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన ఇద్దరు ప్రముఖులకు ప్రతిష్ఠాత్మక డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం జ్వలిత మేధస్సు పురస్కారాలు లభించాయి. స్కూల్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లుకు ఉత్తమ చైర్మన్ గా, ప్రిన్సిపల్ గా గుండబత్తిని బర్నబాస్ డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం జ్వలిత మేధస్సు పురస్కారాలను ప్రదానం చేశారు. విద్యా రంగంలో వారు అందిస్తున్న విశిష్ట సేవలు, దూర దృష్టితో కూడిన నాయకత్వం, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాలు దక్కాయి. విద్యాభివృద్ధికి వారు చేస్తున్న కృషిని నిర్వాహకులు అభినందించారు. ఈ సందర్బంగా స్కూల్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనకు లభించిన అరుదైన గౌరవం విద్యా రంగం పట్ల తమ బాధ్యత మరింత పెంచిందని అన్నారు.ఈ గౌరవం కె-రిడ్జ్ స్కూల్ సిబ్బందికి ఎంతో గర్వకారణమన్నారు. పురస్కారాలు అందుకున్న నాతాని వెంకటేశ్వర్లు, బర్నబాస్ లకు స్కూల్ డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది అభినందిస్తూ భవిష్యత్తులో విద్యా రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
కె-రిడ్జ్ ఇంటర్నేషనల్ చైర్మన్, ప్రిన్సిపల్ లకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
23 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 23, 2026, 03:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)