ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటర్ల జాబితాపై సమీక్ష

20 ఆగస్టు, 2026

review
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 11:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2026లో భాగంగా పల్నాడు జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు, పురావస్తు-మ్యూజియంల శాఖ కమిషనర్‌ ముత్యాలరాజు రేవు, గురువారం నరసరావుపేట కలెక్టర్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కృతికా శుక్లాతో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి చేపడుతున్న చర్యలు, జాబితా రూపకల్పన తదితర అంశాలపై సమీక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్