మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

​ఈసీఐ స్వతంత్రతను, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న జ్ఞానేష్ కుమార్ ని వెంటనే తొలగించాలి

13 గంటల క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 03:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజా సంఘాల డిమాండ్‌

ప్రజాశక్తి -వీరఘట్టం: కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రతను, విశ్వసనీయతను మరియు ప్రజాస్వామ్య సూత్రాలను తీవ్రంగా దెబ్బతీసిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ని తక్షణమే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వీరఘట్టం మండల హెడ్ క్వార్టర్లలోని ఆంజనేయ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ (CITU) జిల్లా ఉపాధ్యక్షురాలు వి. ఇందిర, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎన్. సింహాచలం మాట్లాడారు.

​ఓట్ల తొలగింపుపై ఆందోళన: ప్రత్యేక ఓటర్ల పరిశీలన (Special Voters Verification) పేరుతో దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించడం ప్రజాస్వామ్య వ్యవస్థకే అత్యంత ప్రమాదకరమని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

​ఓటు హక్కుపై కుట్ర: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది రాజ్యాంగం ప్రసాదించిన అత్యంత ప్రాథమిక హక్కు అని, కొన్ని నిర్దిష్ట వర్గాలకు చెంది ఓటర్లను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాన ఎన్నికల కమిషనర్ తో కలిసి కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. దీనివల్ల స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలో రాజకీయ జోక్యం మితిమీరిపోయిందని విమర్శించారు.

​రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన: రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ లో మెజారిటీ కమిషనర్లు (సుఖ్ బీర్ సింగ్ సంధు, వివేక జోషి) అభిప్రాయాల ఆధారంగా నిర్ణయాలు ప్రకటించాల్సి ఉండగా, వారి వ్యతిరేకతను సైతం పక్కన పెట్టి ఏకపక్ష నిర్ణయాలను ప్రజలపై రుద్దడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

​సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకొని, జ్ఞానేష్ కుమార్ ని బాధ్యతల నుండి తొలగించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలందరినీ సమీకరించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎం. ప్రసాద్, ఎల్ల ప్రసాద్, ఎస్. నాగేష్, కె. బలరాం, కె. సన్యాసినాయుడు, మంగా పున్నమ్మ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్